చివరి సవరణ చేసిన తేదీ: సెప్టెంబరు 26, 2014

DRAGON DICTATION చివరి యూజర్ లైసెన్స్ ఒప్పందంతో SWYPE చెయ్యండి

ఇది మీకు (SWYPE మరియు DRAGON DICTATION అనువర్తనాలను ఉపయోగించే ఒక వ్యక్తి లేదా సంస్థ) మరియు/లేదా NUANCE COMMUNICATIONS, INC. ల మధ్య ఉండే చట్ట బద్ధమైన ఒక ఒప్పందం. ("NUANCE") ఈ క్రింద ఇచ్చిన నిబంధనలను దయచేసి జాగ్రత్తగా చదవండి.

SWYPE సాఫ్ట్ వేర్ మరియు/లేదా DRAGON DICTATION సర్వీసులను ఇన్స్టాల్ చేసి ఉపయోగించ డానికి, చివరి యూజర్ లైసెన్స్ ఒప్పందం యొక్క నిబంధనలకు మీరు ("ఒప్పందం") అంగీకరించాలి. "ఆమోదించు" బటన్ ని నొక్కడం ద్వారా, ఈ ఒప్పందం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. ఈ నియమ నిబంధనలను ఆమోదించకుండా, SWYPE సాఫ్ట్ వేర్ లేదా DRAGON DICTATION సర్వీసును మీరు ఏ విధంగానూ ఉపయోగించలేకపోవచ్చు.

టెక్స్ట్ ఇన్ పుట్ మరియు మౌఖిక ఆదేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, టెక్స్ట్ మరియు ఈమెయిల్ సందేశాలను సృష్టించగల సామర్ధ్యంతో, సహా పరికరాల యొక్క కొన్ని ఆపరేషన్లను నియంత్రించడానికి, పరికరాల యొక్క యూజర్లను అనుమతించే వినియోగదారుని/సర్వర్ అనువర్తనాలను, SWYPE సాఫ్ట్ వేర్ మరియు DRAGON DICTATION సర్వీసు కలిగి ఉంటుంది. NUANCE మరియు దానిని సరఫరా చేసేవారు మీకు అందుబాటులో ఉంచే ఏదైనా అదనపు SWYPE సాఫ్ట్ వేర్ తో సహా, SWYPE సాఫ్ట్ వేర్ ని, డౌన్ లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసి ఉపయోగించడానికి ఈ క్రింద ఇచ్చిన సాధారణ నియమ నిబంధనలు మీకు అనుమతిస్తాయి. టెక్స్ట్ ఇన్ పుట్ పద్ధతులను పొందుపరిచే మరియు NUANCE సౌలభ్యం ("సర్వీసు") వద్ద ఇన్స్టాల్ చేసిన DRAGON DICTATION సర్వర్ అనువర్తనాలను మరియు NUANCE పొందుపరిచిన అదనపు డాక్యుమెంట్లను ప్రాప్యత పొందడానికి యూజర్లను అనుమతించే ("సాఫ్ట్ వేర్").

1. లైసెన్స్ అనుగ్రహం. NUANCE మరియు దానిని సరఫరా చేసేవారిచే అందుబాటులో ఉంచే సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులోని దేశాలు మరియు భాషలలో మాత్రమే, ఒకే పరికరంలో సాఫ్ట్ వేర్ ని ఇన్స్టాల్ చేసి ఉపయోగించడానికి మరియు అటువంటి పరికరంలో సాఫ్ట్ వేర్ గుండా సర్వీసుని పొందడానికి ఆబ్జెక్ట్ కోడ్ ఫార్మ్ లో మాత్రమే ఉన్న ఒక వ్యక్తిగత, విశిష్టతలేని, బదిలీ కాని, ఇంకొకరికి ఉప లైసెన్స్ ఇవ్వడానికి కుదరని, రద్దు చేసుకునే పరిమితమైన లైసెన్స్ ని NUANCE మరియు దానిని సరఫరా చేసేవారు మీకు అనుగ్రహిస్తారు. "పరికరం" అనేది http://www.nuancemobilelife.com, లో ఉన్న Nuance వెబ్ సైట్ లో వివరించిన ఒక అధీకృత మొబైల్ పరికరం, దీనిని Nuance తో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయవచ్చు. భాషలు, కీ బోర్డులు, లేదా నిఘంటువులతో మాత్రమే పరిమితం కాకుండా, అదనపు సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ లను NUANCE అందుబాటులో ఉంచుతుంది మరియు ఈ ఒప్పందం ప్రకారం సాఫ్ట్ వేర్ తో ఇచ్చిన అదనపు సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ లను మాత్రమే మీరు ఉపయోగిస్తారని, మరియు అటువంటి అదనపు సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ ల వాడకం ఈ ఒప్పందం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని మీరు అదనంగా అంగీకరిస్తున్నారు. మీ డౌన్ లోడ్ మరియు సాఫ్ట్ వేర్ మరియు సర్వీసు వాడకానికి సంబంధించి, మీరు చెల్లించవలసిన ఏ ఫీజుకైనా మీరే బాధ్యులు మరియు ఎప్పటికప్పుడు మారిపోయే మూడవ పార్టీ (అంటే Google, Amazon, Apple) ద్వారా, చార్జ్ చేయబడతారు. ఈ ఒప్పందంలో వివరించిన విధంగా మీరు సాఫ్ట్ వేర్ లేదా సర్వీసు వాడకానికి థర్డ్ పార్టీకి చెల్లించిన , చెల్లింపులను తిరిగి ఇచ్చే బాధ్యత NUANCE కి లేదు. సాఫ్ట్ వేర్ మరియు సర్వీసు, డేటాను పంపడానికి మరియు అందుకోడానికి మీ వైర్ లెస్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తుందని మరియు సాఫ్ట్ వేర్ మరియు సర్వీసు ఎయిర్ టైమ్, డేటా మరియు/లేదా వాడకం రుసుముకు మీ మొబైల్ ఆపరేటర్ మరియు ఇతర థర్డ్ పార్టీలు మీకు బిల్లు చేస్తారని మీరు అదనంగా ఒప్పుకుని అంగీకరిస్తున్నారు.

2. లైసెన్స్ దారుని బాధ్యతలు.

2.1. నిర్భంధనలు. మీరు (చట్టం అనుమతిస్తే తప్ప) ఈ క్రిందివి చేయలేరు: (a) NUANCE ద్వారా వ్రాతపూర్వకంగా ఆమోదం జరగనప్పుడు, సాఫ్ట్ వేర్ తో లేదా సర్వీసుకి ఆటోమేటిక్ గా లేదా రికార్డు చేసిన ఏవైనా సందేహాలను ఇవ్వండి; (b) మీ స్వంత వాడకానికే కాకుండా వేరే ఉపయోగాలకు సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులను ఉపయోగించండి.; (c) సాఫ్ట్ వేర్ ద్వారా సర్వీసును పొందండి లేదా అనగా సాఫ్ట్ వేరే కాకుండా ఇతర సర్వీసును కూడాపొందండి; (d) మొత్తంగా కాని లేదా పాక్షికంగా కాని సాఫ్ట్ వేర్ ని కాపీ, తిరిగి ఉత్పన్నం, పంపిణీ, లేదా మరేవిధంగానైనా నకలు చేయడం; (e) అమ్మకం, లీజ్, లైసెన్స్, ఉప లైసెన్స్, పంపిణీ, కేటాయింపు, బదిలీ లేదా మరేవైనా మొత్తంగా లేదా పాక్షికంగా సాఫ్ట్ వేర్ లేదా సర్వీసుల హక్కులు అనుమతించ బడుట; (f) సవరించు, పోర్ట్ , అనువదించు లేదా సాఫ్ట్ వేర్ లేదా సర్వీసుల ద్వారా సృజనాత్మక క్రియలను రూపొందించండి; (g) ఏ విధంగానైనా సాఫ్ట్ వేర్ లేదా సర్వీసుల పంపిణీ చెయ్యండి, విడదీయండి, జోడించండి, సూత్రాన్ని వ్యతిరేకించండి లేదంటే నూతన సూత్రీకరణకు ప్రయత్నించండి, సోర్స్ కోడ్ , కీలకమైన అంశాలు లేక ఆల్గరధమ్స్ ను కనుగొనండి లేదా పునఃనిర్మించడి. (h) సాఫ్ట్ వేర్ నుండి గుర్తులు లేదా లేబుళ్ళు, ఏవైనా యాజమాన్య నోటీసులను తొలగించడం; లేదా (i) థర్డ్ పార్టీల ద్వారా అందుబాటులో ఉన్న ఉత్పాదనలు లేదా సర్వీసులతో పోల్చడానికి లేదా ప్రామాణికం చేయడానికి సాఫ్ట్ వేర్ లేదా సర్వీసులను ఉపయోగించండి.

3. యాజమాన్య హక్కులు.

3.1. సాఫ్ట్ వేర్ లేదా సర్వీసు. NUANCE మరియుదాని లైసెన్స్ దారులు, సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులకు చెందిన పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ రహస్యం, ట్రేడ్ మార్క్, మరియు ఇతర మేధోసంపత్తి హక్కు లతో సహా అన్ని హక్కులు, అనగా శీర్షిక, మరియు సాప్ట్ వేర్ పైగల ఆసక్తి మరియు సేవలతో కలిపి, వీటితో మాత్రమే పరిమితం కాకుండా, మరియు అటువంటి హక్కులకు అన్ని శీర్షికలు, NUANCE మరియు/లేదాదాని లైసెన్స్ దారులకు మాత్రమే ఉంటాయి. సాఫ్ట్ వేర్ లేదా సర్వీసును ఆనాధీకృతంగా కాపీ చేయడం, లేదా పై నియమాలను పాటించడంలో విఫలమవ్వడం వలన, ఈ ఒప్పందం ఆటోమేటిక్ గా రద్దుకు దారి తీస్తుంది మరియు మంజూరు చేయబడిన లైసెన్సులన్నీ అప్పటినుండి NUANCE పరమౌతాయి ఉల్లంఘనకి చట్టపరమైన మరియు నిష్పక్షపాతమైన పరిష్కారాలు NUANCE దగ్గర అందుబాటులో ఉంచబడతాయి.

3.2. థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్. నోటీసులు మరియు/లేదా అదనపు నియమ నిబంధనలు కావలసిన థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ని సాఫ్ట్ వేర్ కలిగి ఉంటుంది. అటువంటి కావలసినథర్డ్ పార్టీసాఫ్ట్ వేర్నోటీసులు మరియు/లేదా అదనపు నియమ నిబంధనలు http://swype.com/attributions లో ఉంచబడ్డాయి మరియు అది ఈ ఒప్పందంలో భాగంగా ఉపప్రమాణంలా చేర్చబడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించడం ద్వారా, ఇందులో పేర్కొన్న అదనపు నియమ నిబంధనలు, ఏవైనా ఉంటే, వాటిని కూడా మీరు ఆమోదిస్తున్నారు.

3.3. ప్రసంగ డేటా మరియు లైసెన్సింగ్ డేటా.

(a) ప్రసంగ డేటా. సర్వీసులో భాగంగా, ప్రసంగ గుర్తింపు మరియు ఇతర సర్వీసు అంశాలను మరియు ఇతర NUANCE సర్వీసులు మరియు ఉత్పాదనలను ట్యూన్ చేయడానికి, మెరుగు పరచడానికి, ప్రసంగ డేటాను ఈ క్రింద నిర్వచించిన విధంగా, NUANCE సేకరించి ఉపయోగిస్తుంది. ఈ ఒప్పందం యొక్క నియమ నిబంధనలను ఆమోదించడంలో, ప్రసంగ డేటాను సర్వీసులో భాగంగా, NUANCE సేకరించవచ్చని మరియు ప్రసంగ గుర్తింపు, ఇతర సర్వీసు అంశాలు మరియు ఇతర NUANCE సర్వీసులు మరియు ఉత్పాదనలను ట్యూన్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మరియు మెరుగు పరచడానికి NUANCE నిర్దేశకత్వంలో పనిచేసే NUANCE లేదా థర్డ్ పార్టీల యొక్క గోప్యతా ఒప్పందాలను అనుసరించి మాత్రమే అటువంటి సమాచారాన్ని ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. పైన వివరించిన విధంగా తప్ప, ఏ ప్రసంగ డేటాలోని సమచార అంశాలను NUANCE ఉపయోగించదు. "ప్రసంగ డేటా" అంటే ఈ క్రింద మీరు ఇచ్చిన లేదా సర్వీసుతో సృష్టించిన ఆడియో ఫైల్స్, సంబంధిత ట్రాన్స్క్రిప్షన్లు మరియు లాగ్ ఫైల్స్. మీరు ఇచ్చిన ఏదైనా మరియు ప్రసంగ డేటా అంతా గోప్యంగా ఉంచబడుతుంది మరియు కోర్టు ఆదేశం వంటి చట్టబద్ధమైన లేదా నియంత్రణా అవసరాలు తీర్చడానికి లేదా అవసరమైతే ప్రభుత్వ సంస్థకు లేదా చట్టంతో ఆధీకృతం చేయడం ద్వారా, లేదా NUANCEతో అమ్మడం, ఒకే సంస్థలో కలపడం లేదా ఇంకొక యూనిట్ కి ఇచ్చివేయడం జరిగిన సందర్భంలో, ఒకవేళ అవసరమైతే, NUANCE ద్వారా వెల్లఢి చేయబడుతుంది.

(b) లైసెన్సింగ్ డేటా. సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులలో భాగంగా, NUANCE మరియు దానిని సరఫరా చేసేవారు కూడా లైసెన్సింగ్ డేటాను, ఈ క్రింద నిర్వచించిన విధంగా, సేకరించి ఉపయోగిస్తారు. సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులోని నియమాలలో భాగంగా, NUANCE లైసెన్సింగ్ డేటాను సేకరించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. గోప్యతా ఒప్పందాలను అనుసరించి, NUANCE నిర్దేశకత్వంలో పనిచేసే NUANCE లేదా థర్డ్ పార్టీల ఉత్పాదనలు మరియు సర్వీసులు వికాసం చెందడానికి, అభివృద్ధిచేసి మెరుగుపరచడానికి, లైసెన్సింగ్ డేటా ఉపయోగించబడుతుంది నిర్దుష్టమైన ఏ వ్యక్తితోనైనా సరాసరి సంబంధాన్ని అనుమతించని ఫార్మ్ లో లైసెన్సింగ్ డేటా ఉంటుంది కాబట్టి లైసెన్సింగ్ డేటా వ్యక్తిగతంకాని సమాచారముగా పరిగణించబడుతుంది. "లైసెన్సింగ్ డేటా" అంటే సాఫ్ట్ వేర్మరియు మీ పరికరం గురించినసమాచారము, ఉదాహరణకి: పరికరం బ్రాండ్, మోడల్ సంఖ్య, ప్రదర్శన, పరికరం ఐడి, ఐపి చిరునామా, మరియు దానికి చెందిన డేటా.

(c) ఇక్కడ వివరించిన విధంగా, మీ సాఫ్ట్ వేర్ మరియు సర్వీసుల వాడకం ద్వారా NUANCE లేదా థర్డ్ పార్టీ భాగస్వాములతో స్టోరేజ్, ప్రోసెసింగ్ మరియు ఉపయోగించ డానికి, ప్రసంగ డేటామరియు లైసెన్సింగ్ డేటాలనురెండింటినీ సంయుక్త రాష్ట్రాలకు మరియు/లేదా ఇతర దేశాలకు బదిలీ చేయడంతో సహా, సేకరణ మరియు వాడకానికి మీరు అంగీకరిస్తున్నారని మీకు అర్ధమవుతుంది.

(d) ప్రసంగ డేటా మరియు లైసెన్సింగ్ డేటాలు NUANCE యొక్క అనువర్తించే గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉంటాయి. మరింత సమాచారానికి NUANCE గోప్యతా పాలసీని http://www.nuance.com/company/company-overview/company-policies/privacy-policies/index.htmలో చూడండి

4. మద్దతు. సాఫ్ట్ వేర్ మరియు సర్వీసు మూల్యాంకన విధానాలకు మరియు పరీక్షలకు వీలు కల్పించడానికి, లైసెన్స్ దారుడు NUANCE తరచుగా అడిగే ప్రశ్నలను http://www.nuancemobilelife.comలో చూడవచ్చు. అదనపు మద్దతు కోసం, లైసెన్స్ దారుడు మునుపటి వెబ్ సైట్ ద్వారా అటువంటి మద్దతుని కోరవచ్చు, మరియు NUANCE సిబ్బంది అందుబాటులోకి వచ్చాక, లోపానికి మరియు/లేదా సాఫ్ట్ వేర్ మరియు సర్వీసు యొక్క అంశాలు మరియు పనితీరు యొక్క విశదీకరణకు సంబంధించినఫాక్స్, ఈమెయిల్, లేదా ఇతర విధానాల ద్వారా లైసెన్స్ దారునికి NUANCE తగిన మద్దతు సర్వీసులను ఇవ్వవచ్చు. 48 వ్యాపార గంటల లోపున మీ ప్రశ్నలకు NUANCE మద్దతు సమాధానం ఇస్తుంది (వారం చివరి రోజులు మరియు చట్టబద్ధమైన/ కంపనీ సెలవులు మినహాయించి).

5. వారంటీల నిరాకరణ. NUANCE మరియు దాని లైసెన్స్ ఇచ్చేవారు మరియు సరఫరా చేసేవారు మీకు మాత్రమే సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులను ఇస్తున్నారని మరియు సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారని మీరు అంగీకరిస్తున్నారు. అందువలన, నష్టం లేదా పాడవ్వకుండా మీ డేటా మరియు సిస్టమ్ లను రక్షించ డానికి కావలసిన జాగ్రత్తలు మరియు రక్షణలన్నీ తీసుకుంటారని మీరు అంగీకరిస్తున్నారు. NUANCE, దాని లైసెన్స్ ఇచ్చేవారు మరియు సరఫరా చేసేవారు, లోపాలన్నిటితో మరియు ఏ విధమైన వారంటీ లేకుండా "ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో," సాఫ్ట్ వేర్ మరియు సర్వీసులను ఇస్తారు. అనువర్తించే చట్టం ద్వారా అనుమతించే గరిష్ట స్థాయి వరకు, NUANCE, దాని లైసెన్స్ ఇచ్చేవారు మరియు సరఫరా చేసేవారు, వ్యాపారానికి తగిన వారంటీలు, ఒక ముఖ్యమైన ఉద్దేశానికి సామర్ధ్యం, లేదా ఉల్లంఘన కాని వారంటీలతో సహా, స్పష్టమైన లేదా భావించిన వారంటీలకు నిర్దుష్టంగా మాకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.

6. చట్టపరమైన భాధ్యత యొక్క పరిమితి. అనువర్తించే చట్టం ద్వారా అనుమతించే గరిష్ట స్థాయి వరకు, లాభాలు రాకపోవ డానికి నష్టపరిహారాలు, డేటా నష్టం, వాడక నష్టం, వ్యాపార అవరోధం, లేదా సాఫ్ట్ వేర్ లేదా సర్వీసు ఉపయోగించడం వలన కలిగిన కవరు ఖరీదు, ఎలా సంభవించినా, ఏ భాధ్యతా సిద్ధాంతం ప్రకారమైనా, సలహా ఇచ్చినదైనా కూడా లేదా అటువంటి నష్టపరిహారాలు ముందుగానే తెలిసిఉండాల్సిన అవకాశంతో మాత్రమే పరిమితం కాకుండా, ఏ సందర్భంలోనైనా కూడా నేరుగా గాని, అస్పష్టంగా గాని, ప్రత్యేకంగా గాని, సంభవించేదైనా గాని, ముఖ్యమైనదైనా గాని, లేదా శ్రేష్టమైన నష్ట పరిహారాలకు గాని, ఏ విధంగానూ NUANCE, దాని ఆఫీసర్లు, డైరక్టర్లు, మరియు ఉద్యోగులు, దానిని సరఫరా చేసేవారు లేదా లైసెన్స్ ఇచ్చేవారు, బాధ్యులు కారు.

7. కాలం మరియు ముగింపు. ఈ ఒప్పందం యొక్క నియమ నిబంధనలును మీరు ఆమోదించిన తరువాత ఒప్పందం ప్రారంభమవుతుంది మరియు సమయం అయిన తరువాత ముగుస్తుంది. NUANCE, ఈ ఒప్పందం, మరియు/లేదా ఒప్పందం క్రింద ఇచ్చిన లైసెన్స్ లను, తన ఇష్టానుసారంగా, ఏ సమయములోనైనా, కారణంతో గాని, ఏ కారణం లేకుండా గాని, సర్వీసు కాలం అయిపోయిందని లేదా ముగిసిందని మీకు తెలియచేయడం ద్వారా ముగించవచ్చు. మీ వలన ఏ నియమ నిబంధనలైనా ఉల్లంఘించిన తరువాత ఆటోమేటిక్ గా ఈ ఒప్పందం రద్దవుతుంది. ముగిసిన తరువాత, మీరు సాఫ్ట్ వేర్ ని తక్షణమే ఉపయోగించడాన్ని ఆపివేసి సాఫ్ట్ వేర్ యొక్క అన్ని కాపీలను తొలగించాలి.

8. ఎగుమతి సమ్మతి. మీరు (i) యు.ఎస్. ప్రభుత్వం నిషేధించిన, లేదా యు.ఎస్. ప్రభుత్వంచే "ఆటంకవాది మద్దతు" దేశంగా పేరుపెట్టిన దేశంలో లేరని; మరియు (ii) యు.ఎస్. ప్రభుత్వం నిషేధించిన లేదా నిర్భంధించిన పార్టీల లిస్టులో మీరు లేరని చెప్పి హామీ ఇస్తున్నారు.

9. ట్రేడ్ మార్కులు. సాఫ్ట్ వేర్ లేదా సర్వీసులో ఉన్న లేదా ఉపయోగిస్తున్న థర్డ్-పార్టీ ట్రేడ్ మార్కులు, ట్రేడ్ పేరులు, ఉత్పాదనల పేర్లు మరియు లోగోలు ("ట్రేడ్ మార్కులు") అనేవి ట్రేడ్ మార్కులు లేదా వాటికి సంబంధించిన యజమానులు నమోదుచేసిన ట్రేడ్ మార్కులు, మరియు అటువంటి ట్రేడ్ మార్కుల ఉపయోగం ట్రేడ్ మార్కు యొక్క యజమానికి చట్టపరమైన ప్రయోజనం చేకూర్చుతుంది. అటువంటి ట్రేడ్ మార్కుల వాడకం అంతర్గతంగా పనిచేసే సామర్ధ్యాన్ని సూచించడానికి ఉద్దేశింపబడినది మరియు: (i) అటువంటి కంపనీతో ఒక సంబంధాన్ని, లేదా (ii) NUANCE మరియు దాని ఉత్పాదనలు లేదా సర్వీసుల యొక్క అటువంటి కంపనీ యొక్క ఒక మద్దతు లేదా అంగీకారాన్ని ఇవ్వదు.

10. నిర్వహణ చట్టం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మసాచుసెట్స్ యొక్క కామన్వెల్త్ చట్టాల ద్వారా వాటి చట్టాల యొక్క మూల సూత్రాల వివాదములకు సంబంధము లేకుండా, ఈ ఒప్పందం నిర్వహించబడుతుంది మరియు ఈ ఒప్పందం నుండి కలిగిన ఏవైనా వివాదాలకు, కామన్వెల్త్ ఫెడరల్ మరియు రాష్ట్రాల ప్రత్యేకమైన అధికారానికి మీరు లోబడి ఉండాలి. అంతర్జాతీయ వస్తువుల అమ్మకాల అనువర్తన స్పష్టంగా తీసివేయబడిన ఐక్రాజ్య సమితి కాంట్రాక్ట్ ప్రమాణాల ద్వారా ఈ ఒప్పందం నియంత్రించ బడదు.

11. నిబంధనలు మారవచ్చు. మీరు సంతంకం చేసిన సమయంలో ఇచ్చిన మీ చిరునామాకి, ఈమెయిల్ చిరునామాకి కూడా తగిన నోటీసుని పంపి, NUANCE ఈ ఒప్పందం యొక్క నియమ నిబంధనలను సమయానుసారంగా మార్చ వచ్చని మీరు అంగీకరిస్తున్నారు. ఈ ఒప్పందంలో అటువంటి మార్పులు మీకు అనంగీకారం అయితే, సాఫ్ట్ వేర్ మరియు సర్వీసుని ఉపయోగించడం ఆపడం మాత్రమే దీనికి మీ పరిష్కారము. మీ పునర్విచారణకి NUANCE అటువంటి తగిన నోటీసుని మీకు ఇచ్చిన తరువాత సాఫ్ట్ వేర్ లేదా సర్వీసు యొక్క ఏ భాగాన్నైనా మీరు నిరంతరంగా ఉపయోగించడం ద్వారా, అటువంటి మార్పును మీరు ఆమోదించినట్లుగా పరిగణించ బడుతుంది.

12. సాధారణ చట్ట నిబంధనలు. వ్రాతపూర్వకంగా ముందుగా NUANCE యొక్క సమ్మతి లేకుండా ఈ ఒప్పందం క్రింద ఎటువంటి హక్కులను లేదా భాధ్యతలను మీరు కేటాయించడం గాని లేకపోతే బదిలీ చేయడం గాని చేయకూడదు. ఈ ఒప్పందం NUANCE మరియు మీకు మధ్య పూర్తి ఒప్పందం మరియు సాఫ్ట్ వేర్ కి సంబంధించిన ఏ ఇతర కమ్యూనికేషన్లు లేదా ప్రకటనలపై ఈ ఒప్పందం మించి ఉంటుంది. ఈ ఒప్పందం యొక్కఏ నిబంధనైనా చెల్లుబాటుకాదని లేదా అమలుచేయలేమని ఆపితే, అటువంటి నిబంధనను చెల్లుబాటు అయ్యేంతవరకూ అమలు చేయడానికి వీలైనంత వరకు మాత్రమే సవరణ చేయబడుతుంది, మరియు మిగతా ఒప్పందం పూర్తి ప్రభావంతో కొనసాగుతుంది ఈ ఒప్పందంలోని ఏ నిబంధనను పాటించడం లేదా హక్కుని అమలు చేయడం లో NUANCE వైఫల్యం, అటువంటి హక్కును లేదా నియమాన్ని తీసివేయడానికి దారితీయదు. ఈ ఒప్పందం యొక్క 2, 3, 5, 6, 7, 9, 10, మరియు 12 విభాగములు, ఈ ఒప్పందం యొక్క సమాప్తం లేదా ముగింపును చివరివరకు ఉంచుతాయి.